శేఖర్ కమ్ముల దర్శకత్వంలో..రేవంత్, మౌనిక ల ‘లవ్‌స్టోరి’

వాస్తవం సినిమా: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య-సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్ నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. హైదరాబాదీ స్టైల్లో ‘జీరోకెల్లి వచ్చినా సార్‌.. చానా కష్టపడతా..మంచి ప్లాను ఉంది’ అంటూ నాగ చైతన్య చెప్పే డైలాగ్‌ ఆసక్తికరంగా ఉంది. రేవంత్‌ పాత్రలో చై, మౌనిక పాత్రలో సాయిపల్లవి ఒదిగిపోయినట్టు అనిపిస్తోంది.

టీజర్ చివర్లో నాగచైతన్యతో.. ‘ఏందిరా..వదిలేస్తావా నన్ను’ అంటూ సాయిపల్లవి అన్న మాటలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేశాయి. ఆ వెంటనే సాయి పల్లివి చేతి పట్టుకొని ఊర్లో నుంచి పారిపోతున్న సీన్ ని చూస్తే.. ఇది తేజ స్టయిల్ లవ్ స్టార్ ని శేఖర్ కమ్ముల మార్క్ ట్రీట్ మెంట్ తో చూడబోతున్నామా ? అనిపిస్తొంది. త్వరలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.