ఈ ఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి: రజినీకాంత్

వాస్తవం ప్రతినిధి: గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సూపర్‌స్టార్, తలైవా రజినీకాంత్ ..ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ప్రకటించలేనని, అభిమానులు తనను నన్ను క్షమించాలని ట్వీట్‌ చేశారు .

రజినీకాంత్ రాజకీయాల్లో రావాలంటూ పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు నిరసనలకు దిగుతున్న నేపథ్యంలోఆయన కీలక ప్రకటన చేశారు. ఈ విషయంలో తాను ఓ నిర్ణయం తీసేసుకున్నానని ఆయన తెలిపారు. అందరూ దాన్ని గౌరవించాలని సూచించారు.

“కొంతమంది నా అభిమానులు, రజనీ మక్కల్ మండ్రం నుంచి తొలగించబడిన స్థానిక నేతలు నేను తిరిగి రాజకీయాల్లోకి రావాలని చెన్నైలో నిరసనలు తెలుపుతూ నా నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. నా నిర్ణయాన్ని నేను తీసేసుకున్నాను. దాన్ని అందరికీ చెప్పాను. ఇటువంటి నిరసనలకు దూరంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ఈ ఘటనలు నాకు బాధను కలిగిస్తున్నాయి” అని ఆయన అన్నారు.

డిసెంబర్ 31న పార్టీ పేరును ప్రకటిస్తానని గతంలో రజనీకాంత్‌ తెలిపారు. అయితే ఆయన అస్వస్థతకు గురికావడంతో కొద్ది రోజులు హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ తర్వాత డిశ్చార్జి అయి చెన్నైకి వెళ్లారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో రాజకీయ పార్టీ పేరును ఇప్పట్లో ప్రకటించడంలేదని ట్విట్టర్‌లో తెలిపారు.