మంత్రులు, కలెక్టర్లు తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ

వాస్తవం ప్రతినిధి: మంత్రులు, కలెక్టర్లు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సమావేశం అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా వివిధ శాఖలకు సంబంధించిన అంశాలపై సమీక్ష జరుపుతున్నారు. ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, ముఖ్య అధికారులతో సీఎం సమావేశమయ్యారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, ఆరోగ్య, విద్య, అటవీశాక అధికారులతోపాటు ఇతర ముఖ్య శాఖలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

అలాగే, రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలపై కూడా ఆయ‌న సమీక్షించనున్నారు. ఆయా కార్యక్రమాల అమలును అడిగి తెలుసుకుంటారు. పెండింగ్ లో ఉన్న‌ మ్యుటేషన్లు, సాదాబైనామాల క్రమబద్ధీకరణ వంటి అంశాల‌పై చ‌ర్చ జ‌రుపుతారు. తెలంగాణ‌లో 2021-22 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ సమావేశాలపై మంత్రులు, కలెక్టర్ల ఈ సమావేశంలోనే కేసీఆర్‌ చర్చించి తేదీలను ఖరారు చేసే అవ‌కాశం ఉంది.