అంగరంగ వైభవంగా సింగర్ సునీత వివాహం

వాస్తవం ప్రతినిధి: సింగర్ సునీత వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. బిజినెస్ మేన్ రామ్ వీరపనేని.. సునీత మెడలో మూడుముళ్లు వేశారు. శ‌నివారం రాత్రి హైద‌రాబాద్‌లోని శంషాబాద్ సమీపంలోని అమ్మపల్లిలోని శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం వేదికగా సునీత- రామ్‌ల వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు అతికొద్ది మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాహ వేడుకకి హాజరయ్యారు.

ఈ పెళ్లి వేడుకకు సినీ,రాజ‌కీయ ప్ర‌ముఖుల‌తో పాటు కుటుంబ స‌భ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు హాజ‌ర‌య్యారు. దిల్ రాజు త‌న భార్య తేజ‌స్వితో క‌లిసి సంద‌డి చేయ‌గా, కొత్త జంట నితిన్- శాలిని కూడా ఈ వేడుక‌లో పాల్గొన్నారు. ప్ర‌స్తుతం సునీత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.