‘టక్‌ జగదీష్‌’ కొత్త పోస్టర్‌ నెట్టింట్లో వైరల్‌

వాస్తవం సినిమా: ‘నిన్నుకోరి’ వంటి సూపర్‌ హిట్‌ విజయాన్ని అందించిన దర్శకుడు శివా నిర్వాణతో కలిసి చేతులు కలిపిన నేచురల్ స్టార్ నాని భారీ హిట్‌పై కన్నేశాడు.ఈ ఏడాది టక్‌ జగదీష్‌ చిత్రంతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు .

క్రిస్మస్‌ కానుకగా విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తూ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో నానిని పెళ్లి కొడుకును చేస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది. ఇక సినిమాని సమ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 16న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఇందులో జ‌గ‌దీష్ నాయుడు అనే పాత్ర‌లో క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడు నాని . ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం మంచి ఎమోష‌న్స్‌తో కూడిన పూర్తి కుటుంబ నాటక చిత్రంగా రూపొందుతుంద‌ని తాజాగా విడుదల చేసిన పోస్టర్‌ చూస్తే అర్థమవుతుంది.

ఇక ఇదే విషయాన్ని వివరిస్తూ నాని ట్విట్టర్‌ వేదికగా ‘టక్‌ జగదీష్‌’ కొత్త పోస్టర్‌తో పాటు.. ‘అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏప్రిల్‌ 16, 2021. పేరు గుర్తుందిగా’ అంటూ క్యాప్షన్‌ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కొత్త పోస్టర్‌ నెట్టింట్లో వైరల్‌గా మారింది.