‘క్రాక్’ సినిమా విడుదల వాయిదా

వాస్తవం సినిమా: మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘క్రాక్‌’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 9న అంటే ఈ రోజు థియేటర్లలో విడుదల కానుంది. అయితే అనూహ్యంగా సినిమా విడుదల ఆగిపోయింది.

డాన్ శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ‘క్రాక్’పై భారీ అంచనాలున్నాయి. వరుస వైఫల్యాలతో ఉన్న రవితేజ ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. కానీ, అనివార్య కారణాల వల్ల అవి కాస్తా రద్దు అయ్యాయి. రవితేజ అభిమానులు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. షో రద్దు అయిందని, డబ్బులు రిఫండ్ చేస్తామని తమకు వచ్చిన మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు.

ఫైనాన్షియల్ ఇష్యూస్ క్లియర్ చేసి జనవరి 9 సాయంత్రానికి విడుదల చేయాలని చూస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం సినిమా అసలు విడుదల వాయిదా పడిందని తెలుస్తుంది. సరస్వతి ఫిలిం డివిజన్ పతాకంపై బి. మధు ఈ చిత్రాన్ని నిర్మించాడు. మరి చూడాలిక.. క్రాక్ ఎప్పుడు విడుదల కానుందో..?