శివ రహస్య ప్రవచనం

హైదరాబాద్ నగరం లోని సాకేత్ కాలనీ లో ఉన్న క్షిప్రగణపతి దేవాలయ ప్రాంగణం లో డిసెంబర్ 3 నుండి జనవరి 12 వరకూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువు గారు చేస్తున్నటువంటి  శివ రహస్య ప్రవచన మహా యజ్ఞం అద్భుతమైన గూఢార్ధాల వివరణతో మహోన్నతమైన స్థాయిలో జరుగుతున్నది. కోవిడ్ కి సంబంధించిన అన్ని నిబంధనలు, జాగ్రత్తలతో ఋషిపీఠం ఆధ్వర్యం లో నిర్వహించబడుతున్నది.

కైలాస వర్ణన, శివ కుటుంబము-ప్రమథగణాల వివరణ, జ్యోతిర్లింగ క్షేత్రముల వివరణ, ఋభు గీత, కాశీ మహాత్యం , శివలింగ తత్త్వం, అభిషేక అర్చనాదుల వివరణ, భస్మ మహాత్యం , శివ క్షేత్రములు- భక్తుల గాధలు ఇత్యాది మహోత్తరమైన వివరాలతో విజ్ఞానాత్మకం గా తెలియచేయపడుతున్నవి.

ప్రవచనాంతర్గతంగా హిందూ దేవాలయాలపైనా, సంస్కృతి పైన జరుగుతున్న దాడులపై బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఆవేదన వ్యక్తపరిచారు. సనాతన ధర్మం సర్వమత సామరస్యాన్ని , ప్రపంచ ప్రజలందరి క్షేమాన్నీ కోరుతుందని, ఇటువంటి దాడులపై అందరూ ప్రతిస్పందించాలనీ, మన ధర్మాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ అని అన్నారు.

శివ రహస్య ప్రవచన మహాయజ్ఞం లో అంతర్భాగంగా శివపదార్చన గానావళి ప్రతి రోజూ ప్రవచనం ముందు యూట్యూబ్ మాధ్యమం గా జరుగుతోంది. శ్రీమతి వాణి, రవిశంకర్ గుండ్లపల్లి గార్ల ఆధ్వర్యం లో ప్రపంచవ్యాప్తం గా వివిధ దేశాల నుండి దాదాపు 130 మంది గాయనీ గాయకులు ఇప్పటివరకూ వంద కు పైగా శివపదం కీర్తనలు పాడారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గురువుగారు ఇప్పటివరకూ 1000 కి పైగా శివపదం కీర్తనలు రచించారు.

– రాధికా కామేశ్వరీ