బీజేపీ కన్నెర్ర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయి : జీవీఎల్

వాస్తవం ప్రతినిధి: ఏపీలో ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం ఘటనలు రోజు రోజుకూ పెరుగుతుండడం పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఘాటుగా స్పందించారు. రామతీర్థం వెళ్లాలంటే బీజేపీ నేతలకు ఎందుకు అనుమతి ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కన్నెర్ర చేస్తే ప్రాంతీయ పార్టీలు అడ్రస్ లేకుండా పోతాయని హెచ్చరించారు.

రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై దాడులకు అడ్డుకట్ట పడడంలేదని అన్నారు. దాడులపై చర్యలు తీసుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జీవీఎల్ విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ అకృత్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ఇప్పటివరకు దాడుల ఘటనల్లో ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పాలని నిలదీశారు.

ఆకతాయిల పని అంటూ ప్రచారం చేసి, చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఇటీవల జరిగిన రామతీర్థం ఘటనపై అన్ని వర్గాలు ఆవేదన చెందాయని వివరించారు.