వాస్తవం ప్రతినిధి: ట్రంక్ ఇకనైనా మారరా? అధ్యక్ష పదవి నుంచి దించేసినా ట్రంప్.. టెంపరితనం.. నోటి దురుసతనం ఇంకా తగ్గలేదా అంటున్నారు ప్రపంచ నేతలు.. అమెరికా పార్లమెంటుపై దాడి ఘటనను హేయమైన చర్య అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్ తన మద్దతుదారులను క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు.
అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ క్యాపిటల్ భవనంపై దాడికి ప్రేరేపించడాన్ని తీవ్రంగా ఖండించారు. ‘ఇది నిరసన కాదు.. రాజకీయ తిరుగుబాటు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి ఇతర ప్రపంచ నేతలంతా అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు. ట్రంప్ టెంపరితనంపై ట్విట్టర్ వేదికగా ఏకిపారేస్తున్నారు.
మరోవైపు ట్రంప్ ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలను ఆయా సంస్థలు లాక్ చేశాయి. తమ నియమాలకు విరుద్ధంగా చేసిన ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్ ట్రంప్ ను కోరింది.