క్యాపిటల్ భవనంలో ట్రంప్ మద్దతుదారులు కాల్పులు..మహిళ మృతి

వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పరాజయం పాలైనా పదవిపై వ్యామోహాన్ని వీడడంలేదు. అధయ్క్ష పీఠాన్ని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగబడుతున్నారు. ఆయన మద్దతుదారులు కూడా ఆయన్నే అనుసరిస్తున్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవ్వడం తెలిసిందే. ఆయన గెలుపును ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సమావేశమైంది. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తున్న ట్రంప్ మద్దతుదారులు నినాదాలు చేసుకుంటూ క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఆ సమయంలో కాల్పులు జరిగాయి. ఆందోళనకారులపైకి పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. కాల్పుల్లో ఓ మహిళ మెడలోకి తూటా దూసుకెళ్లింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.