వాస్తవం ప్రతినిధి: సోనూసూద్ ఎప్పుడూ ఏదో ఒక సాయం చేసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోనూసూద్ గొప్ప మనసుకు అభిమానులు, ఫాలోవర్లు, సెలబ్రిటీలు నీరాజనాలు పలికారు. తాజాగా సోనూసూద్ మరోసారి తనవంతు సాయం చేశాడు. మరి ఆయన ఏం చేశాడో తెలుసా? మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం ఆచార్య. ఆ మూవీ కోసం పని చేస్తున్న సిబ్బందిలో వారి పిల్లల చదువుకి స్మార్ట్ ఫోన్స్ అవసరం ఉందని తెలుసుకుని వెంటనే ఆచార్య యూనిట్ మెంబర్స్ కు 100 స్మార్ట్ ఫోన్లను సోనూసూద్ స్వయంగా అందజేశాడీ హీరో. దాంతో మరోసారి తన మానవతా హృదయాన్ని చాటుకున్నాడు సోనూసూద్. అయితే సోనూసూద్ ఇలా సిబ్బందికి స్మార్ట్ ఫోన్లు అందిస్తాడన్న విషయం ఎవరికీ తెలియకపోవడం గమనార్హం. ఇలా సర్ప్రైజ్ చేసి పేదవారికి ఫోన్లు అందించిన సోనూసూద్ కు యూనిట్ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.