వాస్తవం ప్రతినిధి: బో యినపల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ను పోలీసులు చంచల్ గూడా జైలుకు తరలించారు . అఖిలప్రియ కు న్యాయస్థానం ఈ నెల 20 వరకు 14 రొజులపాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆమెను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించిన నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
దాన్ని కోర్టు ఈ రోజు పరిశీలించనుంది. అఖిల ప్రియ గర్భిణి కావడంతో దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఈ కేసులో అన్యాయంగా ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆమె భర్త భార్గవ్ రామ్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. ఆయన కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బంధువులు ప్రవీణ్‌రావు, నవీన్‌రావు, సునీల్రావుల కిడ్నాప్ కేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.