గాయ‌ప‌డ్డ కె ఎల్ రాహుల్ ..భారత్ కు తిరుగు పయనం

వాస్తవం ప్రతినిధి: సిడ్నిలో మూడో టెస్ట్ ప్రారంభానికి రెండు రోజులు స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో భార‌త్ కు షాక్ త‌గిలింది.. ఈ మూడో టెస్ట్ లో ఓపెన‌ర్ గా ఆడ‌నున్న కె ఎల్ రాహుల్ గాయ‌ప‌డ్డాడు..అత‌ని చేతి మ‌డిమ‌కు గాయ‌మైంది మెల్‌బోర్న్ స్టేడియంలో ప్రాక్టీసు చేస్తున్న స‌మ‌యంలో రాహుల్ ఎడ‌మ చేతి మ‌డ‌మ ప‌ట్టేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్‌కు.. మూడు వారాల పాటు కోలుకోవ‌డానికి స‌మ‌యం ప‌డుతుందని బీసీసీఐ వెల్ల‌డించింది. దీంతో అత‌ను ఆస్ట్రేలియాతో జ‌రిగే చివ‌రి రెండు టెస్టుల‌కు మిస్ కానున్నాడు. గాయం చికిత్స కోసం అత‌ను భార‌త్‌కు వ‌స్తున్నాడు. బెంగుళూరులో ఉన్న నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీలో రాహుల్ ఉండ‌నున్నాడు.