ఐదుగురు టీమ్ ఇండియా క్రికెటర్లకు కరోనా నెగటివ్

వాస్తవం సినిమా: ఐసోలేషన్ లో ఉన్న ఐదుగురు టీమ్ ఇండియా క్రికెటర్లకూ కరోనా పరీక్షల్లో నెగటివ్ వచ్చింది. కొత్త సంవత్సరం సందర్భంగా వీరంతా మెల్ బోర్న్ లోని ఒక రెస్టారెంట్ కు వెళ్లిన సంగతి విదితమే. దీంతో అప్రమత్తమైన క్రికెట్ ఆస్ట్రేలియా ఆ రెస్టారెంట్ కు వెళ్లిన రోహిత్ శర్మ, శుభమన్ గిల్, నవదీప్ సైనీ, రిషభ్ పంత్, ఫృద్వీ షాలకు కరోనా పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో వీరందరికీ నెగటివ్ వచ్చింది.