పరిపాలనా రాజధానిగా విశాఖ తేల్చిచెప్పిన అవంతి శ్రీనివాస్..!!

వాస్తవం ప్రతినిధి: ఏపీ ముఖ్యమంత్రి గా జగన్ పగ్గాలు చేపట్టిన నాటి నుండి ఏపీ రాజధాని విషయంలో అనేక సందేహాలు నెలకొన్న సంగతి తెలిసిందే. 3 రాజధానుల నిర్ణయం తెరపైకి తీసుకురావడం తో అమరావతి ని రాజధానిగా ఉంచుతారా? తీసేస్తారా.. అన్న సందేహం ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది. ఈ విషయం న్యాయస్థానాలలో ఉండటంతో కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠత ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది.

ఇలాంటి తరుణంలో విశాఖ పట్టణానికి చెందిన నాయకుడు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. విశాఖ రాజధాని విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా జగన్ ప్రభుత్వం పేదలకు మేలు చేస్తుందని కొనియాడారు.

అంతేకాకుండా సీఎం జగన్ ఆలోచనలో ఉన్న మూడు రాజధానుల నిర్మాణం కూడా త్వరలో ఓ కొలిక్కి వస్తుందని పరిపాలనా రాజధానిగా విశాఖ యే అని చెప్పుకొచ్చారు. దీన్ని ఎవరు అడ్డుకోలేరని పేర్కొన్నారు.