రజినీ నిర్ణయంతో ఒక్కసారిగా మారిపోయిన తమిళనాడు రాజకీయం, స్టాలిన్ కి లైన్ క్లియర్..??

వాస్తవం ప్రతినిధి: వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రజనీకాంత్ పోటీచేయడానికి మొన్నటి వరకు రెడీ అయిన సంగతి తెలిసిందే. స్వయంగా రజినీకాంత్ సోషల్ మీడియా వేదికగా డిసెంబర్ చివరి తారీకులలో కొత్త పార్టీ విధి విధానాలు సిద్ధాంతాలు తెలియజేస్తానని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈలోపు ఇటీవల అనారోగ్యం రావటంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకుని తిరిగి డిశ్చార్జ్ అయిన రజినీకాంత్ అభిమానులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. ఇప్పుడప్పుడే పార్టీ పెట్టే ఆలోచన లేదని యూటర్న్ ప్రకటన విడుదల చేశారు. అభిమానులు క్షమించాలని తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు పేజీల లేఖ రిలీజ్ చేశారు. దీంతో యధావిధిగా ఇప్పుడు బీజేపీ పార్టీ మరియు ఇతర ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలు వేసుకుంటున్నాయి. కమల్ పార్టీ కూడా సరికొత్త స్ట్రాటజీ లతో ముందుకు దూసుకు పోతుంది. ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తే తమిళనాడులో స్టాలిన్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తమిళ మీడియా పేర్కొంటుంది. ఖచ్చితంగా అన్నాడీఎంకే పార్టీ పక్కకు వెళ్లి పోవడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు తమిళనాడు ప్రజలు తమ ఓటింగ్ ద్వారా ఒకే పార్టీ అధికారంలోకి ఉండే రీతిలో ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేకుండా ఉండటం తో ఈసారి కచ్చితంగా డీఎంకే పార్టీ అధికారంలోకి రావడం గ్యారెంటీ అని అంటున్నారు. దీంతో రజినీకాంత్ నిర్ణయంతో స్టాలిన్ ముఖ్యమంత్రి అవడం గ్యారెంటీ అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.