ట్విట్టర్ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన మహేష్ బాబు..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రారంభంలో సరిలేరు నీకెవ్వరు సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిన మహేష్ ప్రస్తుతం గీతా గోవిందం డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.

ఇలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన విషయాల గురించి అభిమానులకు తెలియజేస్తూ మహేష్ అలరిస్తు ఉంటాడు. ఇటువంటి తరుణంలో మహేష్ బాబు ట్విట్టర్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయటం సోషల్ మీడియాలో సంచలనం అయింది. దాదాపు 11 మిలియన్ల ఫాలోవర్స్ తో ఇప్పుడు సౌత్ హీరోలలో మహేశ్ ట్విట్టర్లో రికార్డు కొట్టాడు. దీంతో అభిమానులు సందడి చేస్తూ.. #11millionmaheshians హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఫేస్ బుక్ లో 5.8 మిలియన్లు, ఇన్ స్టాలో 6.1 మిలియన్ల ఫాలోవర్లతో మహేశ్ ఇతర హీరోల కంటే ముందు వరుసలో ఉన్నాడు.