“2001 లో ఈ రోజున మన పార్లమెంటుపై పిరికి దాడిని మేము ఎప్పటికీ మరచిపోలేము” : మోడీ

వాస్తవం ప్రతినిధి: సరిగ్గా 19 సంవత్సరాల క్రితం ఇండియన్ పార్లమెంట్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు చేశారు. సెక్యూరిటీని దాటుకొని పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విధ్వంసం సృష్టించారు. ఉగ్రవాదుల దాడిలో 9 మంది భద్రతా సిబ్బంది మరణించారు. సీఆర్పీఎఫ్, ఢిల్లీ పోలీస్, సిఫై డబ్యూడి శాఖలకు చెందిన సిబ్బంది విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కమలేష్ కుమారి, నానక్ చంద్, రామ్ పాల్, ఓం ప్రకాష్, విజయేందర్ సింగ్, ఘనశ్యామ్ సింగ్, ఎంఎస్ నేగి, జేపీ యాదవ్, విక్రమ్ బసంత్ తదితరులు అమరులయ్యారు. పార్లమెంట్ పై జరిగిన దాడి తరువాత భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది ప్రభుత్వం. పార్లమెంట్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు దేశం ఘననివాళిని అర్పించింది.

2001 పార్లమెంటు దాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు నివాళులర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం, “2001 లో ఈ రోజున మన పార్లమెంటుపై పిరికి దాడిని మేము ఎప్పటికీ మరచిపోలేము” అని అన్నారు.

“మన పార్లమెంటును రక్షించే వారి ప్రాణాలు కోల్పోయిన వారి శౌర్యం మరియు త్యాగాన్ని మనం మరచిపోలేము. భారతదేశం వారికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుతుంది” అని ఆయన ట్వీట్‌లో రాశారు.