ఫైజర్ వ్యాక్సిన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డొనాల్డ్ ట్రంప్

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో కరోనా అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్‏ను అనుమతిస్తూ ఎఫ్‏డీఏ చేసిన ప్రకటనకు.. అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 24 గంటల్లోపు మొదటి టీకా డోసును ప్రజలకు ఇవ్వడం ప్రారంభించనున్నామని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనంతరం ఓ టెలివిజన్ ప్రసంగంలో మాట్లాడుతూ.. “ఫెడ్ఎక్స్, యూపీఎస్‏తో మాకున్న భాగస్వామ్యం ద్వారా ఇప్పటికే దేశంలో ప్రతి రాష్ట్రానికి రవాణాను ప్రారంభించాం. పలు రాష్ట్రాల్లో ఎవరెవరికి ఈ టీకా మొదటి డోసును అందించాలో గవర్నర్లు నిర్ణయిస్తారు అని ట్రంప్ తెలిపారు. కాగా అటు యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం ఫైజర్ టీకాకు ఎఫ్‏డీఏ అనుమతించడంతో కరోనాకు స్వస్తీ పలికే సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. ముందుగా ఈ వ్యాక్సిన్‏ను వైద్య, ఆరోగ్య, మిలిటరీ సిబ్బందితోపాటు వృద్ధులకు అందించనున్నట్లు తెలుస్తోంది.