పోలీసు శాఖలో చేరి ప్రజలను రక్షించాలనుకున్నా: పవన్ కల్యాణ్

వాస్తవం ప్రతినిధి: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎస్ఐ అవ్వాలని చిన్నప్పుడు అన్నకున్నారట. పోలీసు శాఖలో చేరి ప్రజలను రక్షించాలనుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇవాళ తెలిపారు. జనసేన పార్టీ నెల్లూరు జిల్లాలో నేతలతో సమావేశమైన ఆయన.. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. తన తల్లిది నెల్లూరేనని చెప్పిన పవన్.. ఈ జిల్లాలోనే పుట్టి పెరిగానన్నారు.

‘పదో తరగతి గ్రేస్ మార్కులతో పాసయ్యాను. చిన్నప్పుడు గొప్పగొప్ప ఆశయాలుండేవి. పోలీసు శాఖలో చేరాలని.. సబ్ ఇన్స్పెక్టర్ అవ్వాలని అనుకునేవాడిని. పోలీసు శాఖలో చేరి ప్రజలను రక్షించాలని కోరిక ఉండేది‘ అని పవన్ చెప్పారు. అంబేడ్కర్ ఆశించిన సమాజం రావాలన్న పవన్.. తోటి మనుషులకు మంచి చేద్దామనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానన్నారు.

ఇక.. తాను చేసిన మొదటి సినిమా తప్పని సరి పరిస్థితుల్లో చేశానని పవన్ చెప్పారు. తొలిప్రేమ వంటి సినిమాలు తనకు నచ్చుతాయని చెప్పారు.