ఈ నెల 8న భారత్ బంద్ కు రైతుసంఘాలు పిలుపు

వాస్తవం ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 8న భారత్ బంద్ కు రైతుసంఘాలు పిలుపు నిచ్చాయి. ఢిల్లీ శివారులో రైతు ఉద్యమం పదవ రోజుకు చేరింది.

కేంద్ర ప్రభుత్వంతో రైతు సంఘాల నేతలు రెండు సార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో ఇవాళ మరో మారు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు సఫలం కాకుంటే 8న బంద్ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. నూతన వ్యవసాయ చట్టాలను ఎలాంటి పరిమితులు లేకుండా రద్దు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.