హర్యానా మంత్రి కి వ్యాక్సిన్ తీసుకున్నాక కరోనా పాజిటివ్

వాస్తవం ప్రతినిధి: హర్యానా హోం శాఖ మంత్రి అనిల్ విజ్ భారత్ బయోటెక్ పరీక్షిస్తున్న కోవాగ్జిన్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. నెల రోజులు తిరక్కుండానే ఆయనకు కరోనా పాజిటివ్ సోకింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశారు.

తను కరోనా బారిన పడినట్లు తనతో సన్నిహితంగా మెలిగినవారందరూ పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్ లో ఉండాలని మంత్రి కోరారు. ప్రస్తుతం అంబాలా సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
నవంబర్ 20వ తేదీన భారత్ బయోటెక్ పరీక్షిస్తున్న కోవాగ్జిన్ ను నవంబర్ 20వ తేదీన మంత్రి అనిల్ విజ్ అంబాలా కెంట్ హాస్పిటల్ లో తీసుకున్నారు. పీజీఐ రోహతక్ బృందం పర్యవేక్షణలో మంత్రికి వ్యాక్సిన్ వేశారు. ఇది తీసుకున్న తరువాత ఆయన సుమారు గంట పాటు వైద్యుల పర్యవేక్షణ లో ఉన్నారు. అంతకు ముందు వైద్యులు ఆయన రక్త నమూనాలు సేకరించి, ఓకే అనుకున్న తరువాతే ముందుకు వెళ్లారు. ఈ విషయాన్ని మంత్రి స్వయంగా ట్వీట్ చేశారు. ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్ ను తీసుకుంటన్నట్లు మంత్రి అనిల్ విజ్ బహిరంగంగా ప్రకటించారు.
హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ను మూడవ దశలో సుమారు 200 మంది వాలంటీర్లపై ప్రయోగం చేస్తున్నది. వారిలో యాంటీబాడీ అభివృద్ధిపై పరిశోధన చేస్తున్నారు.