ప్రభాస్ తో సినిమా చేయడానికి కారణం అదే అంటున్న ప్రశాంత్ నీల్..!!

వాస్తవం సినిమా: “కేజిఎఫ్” సినిమా విజయంతో ఓవర్ నైట్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు మారుమ్రోగింది. మంచి మాస్ పల్స్ కలిగిన డైరెక్టర్ అని అతనితో సినిమా చేయడానికి బాలీవుడ్ ఇండస్ట్రీ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న టాప్ హీరోలందరూ ఎగబడ్డారు. కన్నడ పరిశ్రమకు చెందిన ప్రశాంత్ నీల్ తాజాగా యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ప్రభాస్ తో చేయబోయే సినిమాకి “సలార్” అనే టైటిల్ కూడా పెట్టడం మనకందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ తో సినిమా చేయడానికి గల కారణం గురించి ఇటీవల ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ అతనికి ఇది కరెక్ట్ గా సూట్ అయ్యే స్క్రిప్ట్ అని తెలిపాడు. అంతేకాకుండా టైటిల్ గురించి వివరణ ఇస్తూ ఉర్దూ భాష ప్రకారం “సలార్” అంటే ఒక సమర్థవంతమైన నాయకుడు అని అన్నారు. అంతేకాక రాజుకి కుడి భుజం లా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడే వ్యక్తి అని కూడా చెప్పవచ్చు అని తెలిపారు. చాలా వైలెంట్ గా ప్రభాస్ ని ఈ సినిమాలో చూపిస్తున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చారు.