చిగురిస్తున్న భారతీయుల ఆశలు.. కీలక బిల్లుకు యూఎస్ సెనేట్ ఆమోదం..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో పనిచేస్తున్న భారతీయ వృత్తి నిపుణులకు శుభవార్త! హెచ్‌1బీ వర్క్‌ వీసాల మీద వెళ్లి గ్రీన్‌కార్డు లేదా శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న వారికి గొప్ప ఊరట! ఉద్యోగ ఆధారిత వలస వీసాలకు సంబంధించి దేశాల వారీగా ఉన్న కోటాను అమెరికా ప్రభుత్వం ఎత్తివేసింది.

అమెరికాలో సుదీర్ఘకాలంగా గ్రీన్‌ కార్డు కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఉపాధి ఆధారిత గ్రీన్‌ కార్డుల మంజూరులో దేశాల కోటాను ఎత్తివేస్తూ రూపొందించిన బిల్లుకి అమెరికా సెనేట్‌ బుధవారం ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. ఏటా మంజూరు చేసే గ్రీన్‌ కార్డుల్లో ఒక్కో దేశానికి 7 శాతం మాత్రమే ఇవ్వాలన్న పరిమితిని ఎత్తి వేస్తూ తీసుకువచ్చిన ఫెయిర్‌నెస్‌ ఫర్‌ హై స్కిల్డ్‌ ఇమి గ్రెంట్స్‌ యాక్ట్‌ని సెనేట్‌ ఆమోదించింది. దీంతో హెచ్‌1బీ వర్క్‌ వీసాలతో అమెరికా వచ్చి శాశ్వత నివాసం లేదా గ్రీన్‌కార్డు కోసం దశాబ్దాల తరబడి ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట లభించినట్లయింది.