ప్రభాస్ “ఆదిపురుష్” లో రావణుడు పాత్రే చాలా కీలకం..!!

వాస్తవం సినిమా: బాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఓమ్ రౌత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ సినిమా ప్రభాస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండగా, రావణుడి పాత్ర లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన రావడం జరిగింది.

ఇప్పటివరకూ రాముడు పాత్ర కలిగిన సినిమాలకు సంబంధించి వచ్చిన సినిమాలన్నీ రావణుడిని విలన్ గా చూపించడం జరిగింది. కానీ ‘ఆదిపురుష్’ సినిమాలో మాత్రం రావణుడిని హీరోయిజం తరహాలో చూపించబోతున్నట్లుగా సైఫ్ ఆలీ ఖాన్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాను కొత్త తరహా రామాయణంను ఆధారం చేసుకుని రావణుడి పాత్రను కొత్తదనం లో చూపించడానికి రెడీ అయినట్లు బాలీవుడ్ వర్గాలలో టాక్. త్వరలోనే ఈ సినిమాని స్టార్ట్ చేసి 2022 ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా అధికారిక తేదీని సినిమా యూనిట్ తెలియజేసింది. విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.