థియేటర్లు ఓపెన్ కావటం తో సంతోషం వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల..!!

వాస్తవం సినిమా: మహమ్మారి కరోనా వైరస్ దెబ్బకి 8 నెలల పాటు సినిమా థియేటర్లు క్లోజ్ అవగా తాజాగా తెరుచుకోవడం జరిగింది. లాక్ డౌన్ లో భాగంగా మార్చిలో క్లోజ్ అయిన థియేటర్లు నేటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దీంతో కొన్ని సినిమా హాల్స్ వద్ద ప్రేక్షకుల సందడి మెల్లగా మొదలైంది. ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్ యాజమాన్యాలు థియేటర్లు ఓపెన్ చేయటంతో ఇండస్ట్రీలో కూడా సందడి వాతావరణం నెలకొంది.

ఈ క్రమంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ట్విట్టర్ ద్వారా ఈ విధంగా స్పందించారు. ‘ఫైనల్లీ… థియేటర్లకి మేము తిరిగి వచ్చాము… సంతోషంగా, సురక్షితంగా చూడటానికి థియేటర్లకు స్వాగతం అంటూ శేఖర్ కమ్ముల ట్వీట్ ద్వారా తెలియజేశారు.

ఇదిలా ఉంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవిలతో ‘లవ్‌ స్టోరీ’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఏషియన్ సినిమాను ఈ మూవీని నిర్మిస్తోంది. లాక్‌డౌన్ మొదలు అవ్వకముందే ఈ మూవీ షూటింగ్‌ సగానికి పైగా పూర్తి అయ్యింది. ఇక మిగిలిన షూటింగ్‌ను త్వరగా పూర్తి చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తుంది.