తొలి రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యింది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ల కౌంటింగ్‌ చేశారు. అనంతరం బ్యాలెట్‌ బాక్సుల లెక్కింపు జరుపుతున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. తాజాగా బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్ జోరు చూపిస్తోంది. ఇక తొలి ఫలితం వెలువడింది. మెహిదీపట్నంలో ఎంఐఎం విజయం సాధించింది.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం తొలి రౌండ్ లో టీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీ గా సాగుతోంది.టీఆర్ఎస్ 43 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. 3 డివిజన్లలో విజయం సాధించింది. బీజేపీ 42 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. 8 డివిజన్లను తన ఖాతాలో వేసుకున్న ఎంఐఎం పార్టీ 20 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది.