శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు విధిగా పాటించాల్సిన నియమాలు!

వాస్తవం ప్రతినిధి: అయ్యప్ప స్వామి భక్తులకు కేరళ సర్కార్ శుభవార్త చెప్పింది. శబరిమలకు అనుమతిస్తున్న భక్తుల సంఖ్యను పెంచుతున్నట్టు కేరళ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇకపై రోజుకు 2000 మందిని.. శని, ఆదివారాల్లో 3000 మందిని అనుమతిస్తామని రాష్ట్ర దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటన వివరాల మేరకు..

భక్తులంతా తప్పనిసరిగా కోవిడ్ 19 నెగిటీవ్ సర్టిఫికెట్ తీసుకురావాలి.

భక్తులదంరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు ఉపయోగించాలిస్వామి దర్శనానికి వచ్చే భక్తులు టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలి.

కరోనా తీవ్రత నేపథ్యంలో పంబ నదిలో స్నానాలకు అనుమతి లేదు

భక్తులకు స్నానాల కోసం ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పంబలో ప్రత్యేకంగా షవర్ల ఏర్పాటు

బేస్ క్యాంపు నుంచి సన్నిధానం వరకూ వెళ్లే దారిలో కొవిడ్ కేంద్రాల ఏర్పాటు

ఇక.. డిసెంబర్ 26వ తేదీన మండల పూజ ఉంటుంది. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం ఉంటుంది. జనవరి 20వ తేదీన ఆలయాన్ని మూసివేస్తారు.