వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టారు.
కాగా గత రాత్రి ఎన్నికల కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.. బ్యాలెట్ పేపరుపై స్వస్తిక్ మార్క్ ఉంటేనే ఓటు వేసినట్టు పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి విడుదల చేసిన సర్క్యులర్ ను నిలిపివేసింది.
దీనిపై బిజెపి నేడు ఉదయం హౌజ్ మోషన్ హైకోర్టు లో దాఖలు చేసింది.. దీనిపై ఏ గుర్తు ఉన్నా ఓటుగా పరిగణించాలన్న ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వలును హైకోర్టు సస్పెండ్ చేసింది. కోర్ట్ తదుపరి ఉత్తర్వులకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. బీజేపీ పిటిషన్ను విచారించిన ధర్మాసనం స్వస్తిస్ గుర్తు కాకుండా ఏ గుర్తు ఉన్నా కోర్టు తదుపలి ఆదేశాలకు లోబడే ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించింది. అలాగే ఇతర మార్క్ లు ఉన్న బ్యాలెట్ లో పత్రాలను పక్కన పెట్టాలని, దీనిపై తర్వాత ఆదేశాలిస్తామని పేర్కొంది..