రజనీ ఎంట్రీ పై సుబ్రహ్మణ్యస్వామి కీలక వ్యాఖ్యలు

వాస్తవం ప్రతినిధి: సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ వార్త తమిళనాడు రాజకీయాల్లో మాత్రమే గాక దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రజినీకాంత్ ఎప్పటినుండో పొలిటికల్ ఫీల్డ్ లోకి అడుగు పెడతారని వార్తలు వస్తున్నా వాటిపైన రజినీ పెద్దగా ఈ మధ్య స్పందించలేదు. మరోపక్క తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాదిలో జరగబోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఫుల్ టెన్షన్ లో ఉన్న సూపర్ స్టార్ అభిమానులకు ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు రజిని.

డిసెంబర్ 31 వ తారీకు నాడు తన కొత్త పొలిటికల్ పార్టీ కి సంబంధించి విధివిధానాలు అన్ని చెప్పబోతున్నట్లు స్పష్టం చేశారు. ఇటువంటి తరుణంలో రజనీ పొలిటికల్ ఎంట్రీ పై బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ట్విట్టర్ ద్వారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటిదాకా తమిళనాడు రాజకీయాలు అన్నాడీఎంకే డీఎంకే పార్టీ మధ్య నడిచాయని, కానీ రజినీ వచ్చాక అన్నాడీఎంకే కి రజనీ కి మధ్య పోటా పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. జైలు నుంచి శశికళ విడుదలైన వెంటనే పరిస్థితి మరోలా ఉంటుందని జోస్యం చెప్పారు.

ఇదిలా ఉంటే సుబ్రహ్మణ్యస్వామి కావాలని డీఎంకే పార్టీపై తమిళ ప్రజలకు ఫోకస్ పడకుండా ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.