భారతీయ అమెరికన్ కు బైడెన్ కీలక పదవి..!!

వాస్తవం ప్రతినిధి: అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌పై జో బైడెన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్నారు. కాగా.. బైడెన్ మాత్రం ట్రంప్‌ను ఏ మాత్రం పట్టించుకోకుండా జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలోనే నాలుగురు సభ్యులతో ప్రెసిడెన్షియల్ ఇనాగురల్ కమిటీ (పీఐసీ)ని ఏర్పాటు చేశారు. ఇందులో భారతీయ అమెరికన్ మజు వర్గేసేకు జో బైడెన్ చోటు కల్పించారు. నలుగురు సభ్యుల కమిటీలో మజు వర్గేసేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు.