పిల్లలతో పవన్ దిగిన ఫోటో నెట్ లో వైరల్..!!

వాస్తవం సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ అధినేతగా ప్రజా సమస్యలపై పోరాడుతూ మరోపక్క సినిమాలు చేసుకుంటూ పార్టీని ఆర్థికంగా ముందుకు నడిపించటానికి ఈ ఏడాది నుండి వరుసపెట్టి సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. గత రెండు సంవత్సరాలు పవన్ ఇండస్ట్రీకి దూరం అవ్వడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మెగా అభిమానుల ఆకలి తీర్చడానికి పవన్ నిర్ణయం తీసుకుని సినిమాలు ఒప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ కొడుకు అకీరా అదేవిధంగా కూతురు ఆధ్యతో కలిసి దిగిన ఫోటో రేణుదేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇద్దరు పిల్లలు పవన్ ఒడిలో నిద్రపోతున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేయాల్సిన అవసరం ఉందని రేణు కామెంట్ పెట్టారు. కొన్ని అరుదైన ఫొటోలను తాను ఫోన్ కెమెరాతో తీశానని చెప్పారు. కాగా రేణుదేశాయ్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలపై పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.