బాలయ్య బాబు సినిమాలో కళ్యాణ్ రామ్..??

వాస్తవం సినిమా: ప్రస్తుతం బాలయ్య బాబు బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా, లెజెండ్ రెండు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించాయి. దీంతో వస్తున్న మూడో సినిమా పై నందమూరి అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని డైరెక్టర్ బోయపాటి సినిమా కి సంబంధించి ప్రతి సన్నివేశం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇలా ఉండగా సినిమాలో కళ్యాణ్ రామ్ కి కూడా ఓ క్యారెక్టర్ ఉండేలా అతిథిగా ఫ్యాన్స్ కి చూపించే ప్రయత్నం బోయపాటి చేస్తున్నట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం సినిమాలో పోలీస్ పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గత కొంత కాలం నుండి బాలయ్య బాబు చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీసు దగ్గర బోల్తా పడటంతో బోయపాటి తో చేస్తున్న సినిమా కచ్చితంగా విజయం సాధించాలని నందమూరి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.