విజయ్ దేవరకొండకు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్..!!

వాస్తవం సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త స్టైల్ పరిచయం చేయటంలో ముందు ఉండే హీరోలలో ఒకరు అల్లు అర్జున్. ప్రతి సినిమాకి తన మేక్ఓవర్ మార్చుకుంటూ సరికొత్త నటనతో స్టైలిష్ లుక్స్ తో తనకంటూ సపరేట్ క్రేజ్ అభిమానులలో క్రియేట్ చేసుకున్నాడు.

ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండస్ట్రీలో పుష్ప అనే సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కొద్దిరోజులు ఆపాలని సినిమా యూనిట్ డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్విటర్ వేదికగా రౌడీ హీరో విజయ్ దేవరకొండకు, రౌడీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

కారణం చూస్తే విజయ్ పంపిన రెండు ఫొటోలు. ఆ ఫొటోలలో అర్జున్ స్టైల్‌గా, ఆసమ్ లుక్‌తో ఉన్నాడు. దాంతో ఆ ఫొటోలు నేట్టింట హల్ చేయడంతో అర్జున్ వాటిపై స్పందించాడు. ‘నేను విజయ్‌తో పాటు రౌడీ క్లబ్‌కు కృతజ్ఞతలు తెలపాలి. ఇంత మంచి ఫోటోలను పంపినందుకు చాలా థాంక్స్ లవ్‌లీ బ్రదర్ అంటూ ట్వీట్ చేశాడు. అల్లు అర్జున్ చేసిన ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.