కృష్ణా జిల్లాలో తుపాను ధాటికి నష్టపోయిన రైతులను పరామర్శిస్తున్న పవన్ కళ్యాణ్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నివర్ తుపాను ధాటికి ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడి నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా జిల్లా వెళ్లి అక్కడి పలు ప్రాంతాల్లో పంటలను పరిశీలిస్తున్నారు. ఆయన వెంట జనసేన నేత నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు.

నివర్ తుపాను ధాటికి ఏపీ రైతులు నష్టపోయిన పంటలను పరిశీలించి, వారితో చర్చించడానికి పవన్ కల్యాణ్ ఈ పర్యటన జరుపుతున్నారు. పంటలను ఏ మేరకు నష్టపోయామన్న విషయం గురించి రైతులు ఆయనకు వివరిస్తున్నారు. మరోపక్క, పవన్ కల్యాణ్‌ను చూడడానికి స్థానిక జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలిలో ఈ పర్యటన కొనసాగుతోంది.