ప్రేమోన్మాది దాడి..యువతి పరిస్థితి విషమం!

వాస్తవం ప్రతినిధి: ఎన్ని చట్టాలొచ్చినా అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. నిత్యం ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంది. ఈ మృగాళ్ల చేతిలో ఎంతోమంది ఆడపిల్లలు బలైపోతున్నారు.

తాజాగా విశాఖపట్నంలో ఓ యువతి బలైంది. వివరాల్లోకి వెళితే విశాఖ పట్టణానికి చెందిన ప్రియాంక శ్రీకాంత్ లు గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కాగా ప్రియాంక వేరొక అబ్బాయితో చనువుగా ఉండటం తో తట్టుకోలేక ప్రియుడు శ్రీకాంత్ ఆమెపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె మెడపై కత్తితో దాడి చేశాడు. ఆ దాడి తర్వాత ప్రియుడు శ్రీకాంత్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు.

ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ప్రియాంక డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. మరోవైపు సచివాలయంలో వలంటీర్ గా పనిచేస్తుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.