మరికొన్ని వారాల్లో ట్రంప్ వైట్ హౌస్ నుండి నిష్క్రమణ.. ఇవాంకా ఆసక్తికర ట్వీట్..!!

వాస్తవం ప్రతినిధి: అగ్రరాజ్యం రాజకీయాల్లో కురువృద్ధుడైన డెమొక్రటిక్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ శ్వేతసౌథంలోకి అధ్యక్ష హోదాలో అడుగుపెట్టడానికి సర్వ సిద్ధమౌతుంది. ఈ తరుణంలో వచ్ఛే జనవరిలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను వీడనున్నారు. మరికొన్ని వారాల్లో ఆయన నిష్క్రమణ జరగనుండగా ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ ఇండియాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మోదీతో కలిసి తాను పాల్గొన్న ఫోటోలను షేర్ చేస్తూ.. భారత ప్రజల ఆదరణను తాను మరువలేనన్నారు. 2017 నవంబరులో ప్రధాని మోదీతో కలిసి గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సదస్సులో పాల్గొన్న ఈవెంట్ ను గుర్తు చేస్తూ కొన్ని ఫోటోలను ట్వీట్ చేశారు.