ఫైజర్ వ్యాక్సిన్‌‌కు గ్రీన్ సిగ్నల్.. తొలి పాశ్చాత్య దేశంగా యూకే రికార్డ్..!!

వాస్తవం ప్రతినిధి: కరోనా వ్యాక్సిన్‌‌‌‌కు అంగీకారం తెలిపిన తొలి పాశ్చాత్య దేశంగా యూకే నిలిచింది. బయోఎన్‌‌టెక్‌ ఎస్‌ఈతో కలసి ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్‌‌కు యూకే ఆమోద ముద్ర వేసింది. వచ్చే వారం నుంచి తమ దేశంలోె ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు యూకే ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తించాల‌ని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడ‌క్ట్స్ రెగ్యులేట‌రీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫార‌సును బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఆమోదించింది. యునైటెడ్ కింగ్‌డ‌మ్ వ్యాప్తంగా వ‌చ్చే వారం నుంచే ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమ‌తి సాధించ‌డంపై ఫైజ‌ర్ సీఈవో ఆల్బ‌ర్ట్ బౌర్లా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇందుకు స‌హ‌క‌రించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయ‌న కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.