వాస్తవం ప్రతినిధి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ట్రంప్ కు సంబంధించి నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఓ పాకిస్తాన్ యువతి తాను ట్రంప్ నిజమైన కుమార్తెని అంటూ ప్రకటించుకుంది. ఇక ఆమె మీడియాతో మాట్లాడుతూ.. “డొనాల్డ్ ట్రంప్ నా నిజమైన తండ్రి. నేను మా నాన్నని కలుసుకోవాలని భావిస్తున్నాను. ఆయన నన్ను, మా అమ్మని పట్టించుకోవడం మానేశారు. దీని గురించి మా అమ్మ, ట్రంప్‌తో గొడవపడేది” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.