కేంద్రం అనుమతిస్తే.. ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ..!!

వాస్తవం ప్రతినిధి: ప్రవాస భారతీయులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ప్రతిపాదించింది. కేంద్రం అనుమతిస్తే.. ప్రస్తుతం సైనిక బలగాలకు అందుబాటులో ఉన్న ఎలక్ట్రానికల్లీ ట్రాన్స్‌మిటెడ్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ సిస్టం(ఈటీపీబీఎస్‌)ను విదేశాల్లోని అర్హులైన భారతీయ ఓటర్లు కూడా వినియోగించుకునే వీలుం టుంది. ఈ మేరకు ఈసీ నవంబర్‌ 27వ తేదీన న్యాయశాఖకు లేఖ రాసింది. ఇప్పటికే భద్రతా బలగాలకు ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నందున విదేశాల్లోని భారతీ యులకు కూడా అందుబాటు లోకి తేగలమనే నమ్మకం ఉందని అందులో తెలిపింది. సర్వీసు ఓటర్ల విషయంలో పోస్టల్‌ బ్యాలెట్‌ పద్ధతి విజయవంతంగా కొనసాగుతోందని, ఈ సేవలను ప్రవాస భారతీయులకు పొడిగించవచ్చని ఈసీ పేర్కొంది.