వాస్తవం ప్రతినిధి: అమెరికాలోకి విదేశీ నిపుణుల రాకను అడ్డుకోవడం ద్వారా స్ధానికులకు ఉపాధి పెంచేందుకు ట్రంప్ సర్కార్ వీసాలపై ఆంక్షలు విధిస్తూ అక్టోబర్ లో ఆదేశాలు జారీ చేసింది. హెచ్ 1బీ వీసాలపై మూడవ పార్టీ సంస్థలలో హెచ్ 1బీ ఉద్యోగాల నియామకాలపై ఏడాది పాటునిషేధం విధించింది. దీనిపై బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్, యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మానుఫ్యాక్చరర్స్ , ఇతర గ్రూపులు సవాల్చేసిన సంగతి తెలిసిందే.
అయితే, ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన హెచ్1బీ వీసాల ఆంక్షలపై అమెరికా ఫెడరల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఆంక్షలను కాలిఫోర్నియాలోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి జెఫ్రీ వైట్ తోసిపుచ్చారు. ఈ విషయంలో ట్రంప్ ప్రభుత్వం పారదర్శక విధానాలను పాటించలేదని తెలిపింది. ఈ తీర్పుతో బే ఏరియా కౌన్సిల్, స్టాన్ఫర్డ్ శ్వవిద్యాలయం, ఇతర విద్యా వ్యాపార వర్గం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనపై చట్టపరమైన విజయం సాధించారు. ఇది మన ఆర్థిక వ్యవస్థకు, చెత్త ఆదేశాలపై సాధించిన పెద్ద విజయం” అని బే ఏరియా కౌన్సిల్ సీఈవో జిమ్ వుండెర్మాన్ ఒక ప్రకటనలో తెలిపారు.