సుశాంత్ సింగ్ మరణంపై ఫ్రెండ్ బయటపెట్టిన సంచలన విషయాలు..??

వాస్తవం సినిమా: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణించడం అప్పట్లో చాలామందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. సరిగ్గా లాక్ డౌన్ సమయంలో మూడు పదుల వయసు కలిగి ఇండస్ట్రీలో మంచి పేరు, క్రేజ్ ఉన్న సుశాంత్ ఒక్కసారిగా ఉరివేసుకొని చనిపోవడం పట్ల అనేక మంది అనుమానం వ్యక్తం చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులు కావాలని సుశాంత్ కి అవకాశాలు రాకుండా చేయడం వల్ల ఆయన మరణించినట్లు ఆరోపించారు. దీంతో పెద్ద ఎత్తున బాలీవుడ్ పెద్దల పై సోషల్ మీడియాలో నెటిజన్లు మండి పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి పేరు తెరపైకి వచ్చిందో అనేక విషయాలు బయటపడ్డాయి. ఆమె అరెస్టు కూడా అవ్వడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉండగా ఈ కేసుకు సంబంధించి సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్థ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వెల్లడించారు. సుశాంత్ లో చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయని.. సక్సెస్ ఫెయిల్యూర్ ను సమానంగా తీసుకుంటాడని తెలిపారు. ఆయనలో మానసిక పరిణతి చాలా ఉందని వివరించారు. ఎప్పుడూ కొత్త ఆలోచనలు కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుంటాడు అని సిద్ధార్థ గుప్తా పేర్కొన్నాడు. సరిగ్గా సుశాంత్ మరణించడానికి ముందు ఐదు రోజులు తనకి మరో స్నేహితుడికి ఒక మెసేజ్ పెట్టడం జరిగిందని సిద్ధార్థ తెలిపారు. తనకి ఆధ్యాత్మిక చింత ఎక్కువైందని ఆ సందేశంలో తెలిపారని చెప్పుకొచ్చాడు. త్వరలో కలుద్దాం అని భావించిన తరుణంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ గుప్తా ఇంటర్వ్యూలో తెలిపారు.