స్లిమ్ అవుతున్న పవన్ కల్యాణ్..!!

వాస్తవం సినిమా: మొన్నటి వరకు దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ద్రవ పదార్థాలతో మాత్రమే డైట్ మెయింటెన్ చేస్తున్నారట. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న “వకీల్ సాబ్” సినిమా క్లైమాక్స్ కోసం పవన్ కళ్యాణ్ చాలా స్లిమ్ గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఒకపక్క రాజకీయాలు చేస్తూనే మరోపక్క వరుసగా సినిమా ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నారు. కాక దాదాపు రెండు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి మళ్లీ సినిమా రంగంలో అడుగు పెట్టడంతో రీ ఎంట్రీ మూవీ “వకీల్ సాబ్” తో భారీగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ లెక్కలు వేస్తున్నారట. పైగా నిహారిక పెళ్లి కూడా ఉండటంతో సన్నగా ఉండాలని లిక్విడ్ డైట్‌ను పాటిస్తున్నాడు.

బాలీవుడ్ “పింక్” సినిమా రీమేక్ గా వస్తున్న “వకీల్ సాబ్” లో పవన్ కళ్యాణ్ రీమేక్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేసే అవకాశం ఉంది అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది. ఒక హరీష్ శంకర్ సినిమా మాత్రమేకాక క్రిష్ ఇంకా మరికొన్ని ప్రాజెక్టులు రాబోయే రెండు సంవత్సరాలలో లైన్ లో పెట్టి వరుసగా సినిమాలు చేసే ఆలోచనలో పవన్ వున్నట్లు సమాచారం.