“ఆర్ఆర్ఆర్” లో కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసిన రాజమౌళి..??

వాస్తవం సినిమా: బాహుబలి వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రాజెక్టు “ఆర్ఆర్ఆర్”. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఈ సినిమాను తీసుకోవడం జరిగింది. “బాహుబలి” తో ప్రపంచ స్థాయి విజయం సాధించడంతో “ఆర్ఆర్ఆర్” ఈ సినిమాతో కూడా అదే స్థాయిలో విజయం సాధించాలని జక్కన్న ఎన్టీఆర్, చరణ్ తో కలిసి ఈ సినిమాను చేస్తున్నాడు.

వాస్తవానికి ఈ సినిమా ప్రారంభమైన మొదటి లో ఈ ఏడాది జూన్ మాసంలో 30 వ తారీకు రిలీజ్ అవుతుందని డేట్ కూడా ప్రకటించడం జరిగింది. కానీ షూటింగ్ మొదలయ్యాక ఇద్దరి హీరోలకు దెబ్బలు తగలడం తో పాటు ఎన్టీఆర్ హీరోయిన్ విషయంలో చాలా టైం పట్టడంతో పాటు కరోనా దెబ్బకు సినిమా విడుదల విషయంలో వేసుకున్న లెక్కలన్నీ తారుమారయ్యాయి.

ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొదలుపెట్టాడు రాజమౌళి. ఈ క్రమంలో సినిమా లో భారీ యాక్షన్ సీన్ తాజాగా సినిమా యూనిట్ కంప్లీట్ చేసినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. ఈ సన్నివేశం “ఆర్ఆర్ఆర్” సినిమాకి అన్నిటికన్నా పెద్ద హైలెట్ అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినపడుతోంది.