మోడీ సర్కార్ ని టెన్షన్ పెట్టిస్తున్న రైతు ఉద్యమం..!!

వాస్తవం ప్రతినిధి: ఇక ఎదురు లేదు అని అనుకుంటున్న మోడీ ప్రభుత్వానికి దేశ వ్యాప్తంగా రైతులు చేపడుతున్న ఉద్యమం టెన్షన్ పెట్టిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఈ ఉద్యమం పట్ల ఇతర దేశాల నాయకులు కూడా స్పందించడంతో అంతర్జాతీయంగా మోడీ పరువు కూడా పోయే పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఢిల్లీలో పంజాబ్ రాష్ట్ర రైతులు ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు నిరసనగా భారీ స్థాయిలో నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పంజాబ్ రైతుల ఆందోళనలకు మద్దతుగా యూపీ, హర్యానా నుండి కూడా రైతులు భారీ స్థాయిలో బయలుదేరుతున్నారు.

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకునే అవకాశం ఉండటంతో రైతులను ఢిల్లీ సరిహద్దుల వద్ద పోలీసులు అడ్డుకుంటున్నారు. భారీగా బలగాలు మోహరింపు తో రైతులు సరిహద్దుల వద్ద ఆగిపోయే పరిస్థితి నెలకొంది. రైతుల నిరసనలతో ఢిల్లీలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

కేంద్రం కొత్త గా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలపై ఏదో ఒకటి తేలే వరకు ఢిల్లీలో నిరసన కొనసాగిస్తామని రైతులు భారీ స్థాయిలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. మధ్యవర్తుల తో చర్చలు అనవసరమని కేంద్రం వ్యవసాయ చట్టాల విషయంలో పునరాలోచించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.