తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటన కు బయలుదేరిన పవన్

వాస్తవం ప్రతినిధి: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, నివర్ తుపాను ధాటికి ఏపీ రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బయలుదేరారు. కాసేపట్లో ఆయన గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కంకిపాడు మీదుగా కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన మొదలవుతుంది.

ఉయ్యూరు, పామర్రు, అవనిగడ్డ మీదుగా భట్టిప్రోలు చావలి, తెనాలి వైపు ఈ పర్యటన ఉంటుంది. ఈ నెల 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మరికొన్ని ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా ఆయా జిల్లాల జనసేన నేతలతోనూ పవన్ కల్యాణ్ చర్చలు జరిపి, తమ పార్టీ బలోపేతంపై ఆయన వారికి సూచనలు చేస్తారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన నేతలు ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.