గంటాకి బిజెపి నుండి బంపర్ ఆఫర్..??

వాస్తవం ప్రతినిధి: అధికారం ఎక్కడ ఉంటే గంటా శ్రీనివాసరావు అక్కడ ఉంటారని ఆయన ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ ఉంటారు. దీంతో 2019 ఎన్నికలలో గంటా శ్రీనివాసరావు టిడిపి ఎమ్మెల్యేగా గెలిచిన గాని.. అధికారంలోకి వైసిపి రావటంతో ఆయన పార్టీ మారడానికి మొన్నటిదాకా శతవిధాల ప్రయత్నాలు చేయటం జరిగినట్లు ఏపీ రాజకీయాల్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే గంటా వైసీపీ పార్టీ లోకి రావటం పట్ల చాలామంది వైసీపీలో ఉండే కీలక నాయకులు చివరి నిమిషంలో విభేదించటం తో పాటు అధినేత వైయస్ జగన్ కూడా గంట రాక పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేని పరిస్థితి ఉంది.

ఇటువంటి తరుణంలో బీజేపీలో కీలకంగా రాణిస్తున్న సుజనా చౌదరి అదేవిధంగా సీఎం రమేష్ ఇద్దరు గంటా శ్రీనివాస్ ని బీజేపీలోకి తీసుకురావటానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గంలో కీలక నేత కావడంతో బీజేపీ హైకమాండ్ కూడా గంటా శ్రీనివాస్ ని పార్టీలోకి తీసుకోవడానికి రెడీ అయినట్లు సమాచారం. గంట ఓకే అంటే ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి కూడా ఆయనకు కట్టబెట్టడానికి బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.