గ్రేటర్ వార్: తక్కువగా నమోదవుతున్న పోలింగ్..!!

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ బూత్ ల వద్ద అసలు జనం కనబడటం లేదు. చాలా మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్న సామాన్య జనం నుండి మాత్రం మిశ్రమ స్పందన కనబడుతుంది. నంది నగర్ లో మంత్రి కేటీఆర్ తన కుటుంబ సమేతంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుందన్ బాగ్ లో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ నేత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాచి గూడ లో తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సతీ సమేతంగా తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. నాంపల్లి లోని వ్యాయమశాల ఉన్నత పాటశాల లో సైబరాబాద్ పోలీస్ కమీషనర్ తన ఓటు హక్కును వినియోగించుకోగా, సీపీ మహేష్ భగవత్ కుందన్ బాగ్ లో ఓటు వేశారు. ఇంక నటుడు నాగ శౌర్య తన తల్లితో కలిసి షేక్ పేట లో ఓటు వేయగా, అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రి పురం డివిజన్ లో తన ఓటు వేశారు.

ఇదిలా ఉండగా సాయంత్రం అవుతున్న గానీ జనం నుండి పెద్దగా స్పందన రావడం లేదన్న టాక్ వస్తోంది. దాదాపు 18 సంవత్సరాల తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికలలో బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించడం గమనార్హం. పోలింగ్ చివరి దశకు వస్తున్న నేపథ్యంలో చాలా చోట్ల కొన్ని చెదురుమదురు ఘటనలు జరుగుతుండగా మరికొన్ని చోట్ల ప్రశాంతమైన వాతావరణం లోనే పోలింగ్ జరుగుతోంది.