‘అమ్మమ్మకు థ్యాంక్స్’ అంటూ ట్వీట్ చేసిన కేటీఆర్

వాస్తవం ప్రతినిధి: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొంతమంది దివ్యాంగులు, వయోవృద్ధులు ఓటు వేసి స్ఫూర్తి నింపుతున్నారు. ఆరోగ్యం సహకరించకపోయినా… వయసు పైబడినా కూడా కొంతమంది పోలింగ్ కేంద్రాలకు రావడం నేతలను సైతం విస్మయానికి గురిచేస్తోంది.

ఓ 80 ఏళ్ల వయోవృద్ధురాలు ఓటు హక్కు వినియోగించుకోగా.. ఆమె మనవరాలు ఆ ఫొటోను ట్వీట్టర్ లో షేర్ చేయడంతో మంత్రి కేటీఆర్ కూడా చూశారు. వెంటనే.. ‘అమ్మమ్మకు థ్యాంక్స్’ అంటూ రిప్లయ్ ఇచ్చి రీ ట్వీట్ చేశారు. ఓటు వేయకుండా కుంటిసాకులు చెప్పే వారికి ఈమే ప్రేరణ అని పేర్కొన్నారు.