గుడ్‌ న్యూస్‌ చెప్పిన మోడర్నా.. 94.1% ఎఫెక్టివ్ గా కోవిడ్-19 వ్యాక్సిన్..!!

వాస్తవం ప్రతినిధి: వ్యాక్సిన్ ప్రయోగాల్లో వరుస సానుకూల ఫలితాలు భారీ ఊరటనిస్తున్నాయి.తాజాగా అమెరికాకు బయోటెక్ దిగ్గజం మోడర్నా తన కోవిడ్-19 వ్యాక్సిన్‌ ప్రయోగాలకు సంబంధించి కొత్త డేటాను సోమవారం విడుదల చేసింది. కరోనా సోకినా.. నూటికి నూరు శాతం డిసీజ్ సీరియస్ కాకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుంటుందని అమెరికన్ బయోటెక్నాలజీ కంపెనీ మోడెర్నా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ కరోనా నివారణలో 94.1% ఎఫెక్టివ్‌గా పని చేసిందని వెల్లడించింది. అమెరికా, యూరప్‌లో తమ వ్యాక్సిన్ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతివ్వాలని కోరుతూ సోమవారం అప్లై చేసుకుంటున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. 30 వేల మందిపై ఫేజ్–3 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. 100% మందికి కరోనా సీరియస్ కాకుండా తమ వ్యాక్సిన్ అడ్డుకుందని తెలిపింది.